నీ చెలిమి వయసు
చిరుప్రాయమైన
మన ఆత్మల కలయిక
ఈ జన్మలదో.....
నీ సన్నిహితంలో
నా తనువు
చలన రహితమవుతుంది
నా ప్రాణం నీ ఉపిరి
శ్వాసలో చేరి
నీలో జీవమై
నాకు కనిపిస్తూ ఉంటుంది
నీ దూరం లో
నా మనసు మావునాన్ని ఆశ్రయిస్తే
తప్పని సరి క్రియలను చేస్తూ
ఈ సరిరం ...నీ తలపుల
కొలనులో సేదతిరుతూ
ఆనందాన్ని ఆస్వాదిస్తుంది
ఇది ఏమైనా....
మన మద్యన పెనవేసుకున్న
ఈ భందం.....
ఎన్నతికీ వాడని,
సుగందాలు విడని
వసంతంలో విరిసిన
తెల్లని స్వచ్చమయిన మల్లియ.....
( ఆంద్ర భూమి విక్లి లో ప్రచురించ బడినది )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి