28, అక్టోబర్ 2011, శుక్రవారం

అమ్మ తనం

కవితో .......కావ్యమో .....
తెలియదు నేను వ్రాసేది
కానీ....
నా హృదయ స్పందనలతో
జీవం పోసుకుని
బావల అమరికలతో
అపురూపంగా మలిగిన
అందమైన పాపడు
నా ఊహల శిల్ప మైనవాడు
వేదిక కాగితమైతే..
కలాన్నివాడుకున్నాను.....
గర్బాసయంగా ......
పురిటి కందుని చూసి
ఉప్పొంగి నదీ మనసు
అమ్మ తనంతో
తడిసి ముద్ద అయింది

9, అక్టోబర్ 2011, ఆదివారం

నీ చెలిమి

నీ చెలిమి వయసు
చిరుప్రాయమైన
మన ఆత్మల కలయిక
ఈ జన్మలదో.....
నీ సన్నిహితంలో
నా తనువు
చలన రహితమవుతుంది
నా ప్రాణం నీ ఉపిరి
శ్వాసలో చేరి
నీలో జీవమై
నాకు కనిపిస్తూ ఉంటుంది

నీ దూరం లో
నా మనసు మావునాన్ని ఆశ్రయిస్తే
తప్పని సరి క్రియలను చేస్తూ
ఈ సరిరం ...నీ తలపుల
కొలనులో సేదతిరుతూ
ఆనందాన్ని ఆస్వాదిస్తుంది
ఇది ఏమైనా....
మన మద్యన పెనవేసుకున్న
ఈ భందం.....
ఎన్నతికీ వాడని,
సుగందాలు విడని
వసంతంలో విరిసిన
తెల్లని స్వచ్చమయిన మల్లియ.....


( ఆంద్ర భూమి విక్లి లో ప్రచురించ బడినది )

kanniti chukka

కనురెప్పల అంచున చేరిన
కన్నీటి చుక్క
చెక్కిలిపై నుండి దూకి
ఆత్మాహుతి చేసుకోబోతు
క్షనమ్ లో మిల్లి సెకను
పునరాలోచన చేసింది
"ఇన్నాళ్లూతనను దాచుకున్న
కన్నుకి తను దూరమై పొతే....
ఏముతుంది ......!" అని
వెంటనే...రెప్పల అంచునుండి
కంటిలోనికి జారి ఇనికి పోయింది....

నేస్తం......!
ఆ "కంటి చుక్క" చేసిన
పునరాలోచన నీవూ చేసి చూడు.....
నీ చూపుల వాన కురియక
బీటలు పడిన
నా గుండె కనిపిస్తుంది......
ఎండిన రక్తం తో
ఉపిరంధక కొట్టుకుంటూ.....

( ఆంద్ర భూమి విక్లిలో ప్రచురించ బడినది )

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

తేనే తట్టు

గడప కావాలా
గట్టుంది ....
గట్టుమిదా....
చెట్టుంది
చేట్టుమిదా ....
తేనే తట్టుంది
మమకారపు బంధనాలు
తెంచుకోవే మనసా.....
గడప దాటి వస్తేనే (దేహము విడి )
తేనే తట్టు (స్వర్గం) నీ సొంతమగును కదా....

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

sadguru sai

సద్గురు సాయి హరతినే
ఇహము మరచి వీక్షిన్చెదము
సాయి సంనిదానములో
అతమానందము పొందెదము // సద్గురు //

మతాల కతీతము
మానవత్వమే
సాయి సుక్తుల సరామ్సము
వేదనల విడిచీ భావనల నిలిపి
నిత్యం సాయిని కొలిచెదము //సద్గురు //

జోలె చాచి బిక్ష అడుగు సాయి
పాపాల హరించి
పావనము చేయును మన జీవితము
నిటిలోనే దీపాలు వెలిగించి సాయి
నిర్మలమయినది నిజాము
నిజమని చాటెను
సమాధి అందు సజీవమై ఉంది
సమాదానమిచ్చు సాయిని
నిత్యం మనము కొలిచెదము //సద్గురు//