కనురెప్పల అంచున చేరిన
కన్నీటి చుక్క
చెక్కిలిపై నుండి దూకి
ఆత్మాహుతి చేసుకోబోతు
క్షనమ్ లో మిల్లి సెకను
పునరాలోచన చేసింది
"ఇన్నాళ్లూతనను దాచుకున్న
కన్నుకి తను దూరమై పొతే....
ఏముతుంది ......!" అని
వెంటనే...రెప్పల అంచునుండి
కంటిలోనికి జారి ఇనికి పోయింది....
నేస్తం......!
ఆ "కంటి చుక్క" చేసిన
పునరాలోచన నీవూ చేసి చూడు.....
నీ చూపుల వాన కురియక
బీటలు పడిన
నా గుండె కనిపిస్తుంది......
ఎండిన రక్తం తో
ఉపిరంధక కొట్టుకుంటూ.....
( ఆంద్ర భూమి విక్లిలో ప్రచురించ బడినది )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి